• facebook
  • whatsapp
  • telegram

అంబేడ్కర్‌ వ‌ర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అక్టోబ‌రు 14, 15 తేదీల్లో నిర్వహించాల్సిన దూరవిద్య డిగ్రీ 5వ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు అధ్యయన కేంద్రం సహాయ సంచాలకుడు డాక్టర్‌ ఎం.అజంతకుమార్‌ తెలిపారు. 16వ తేదీ నుంచి ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆయన చెప్పారు.

Posted Date : 15-10-2020 .