• facebook
  • whatsapp
  • telegram

దోస్త్‌ మూడో విడతలో 57,695 మందికి సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) మూడో విడతలో 57,695 మందికి సీట్లు దక్కాయి. వీరిలో గతంలో సీట్లు పొందిన విద్యార్థులు ఉన్నా.. ఈ సారి మెరుగైన సీట్లు దక్కించుకున్న వారు 7,182 మంది ఉన్నారు. మూడో విడత సీట్లను గురువారం విద్యార్థులకు కేటాయించారు. మొత్తం 74,984 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అయితే 9,368 మంది తగినన్ని ఆప్షన్లు ఇవ్వని కారణంగా సీట్లు పొందలేకపోయారని కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఈ నెల 26 లోపు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా సీటు రిజర్వు చేసుకోవాలని సూచించారు.
 

26వ తేదీ వరకు ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్‌
దోస్త్‌లో ఇప్పటివరకు నమోదు కాని విద్యార్థులు అక్టోబ‌రు 26వ తేదీ వరకు ప్రత్యేక విడత కింద రిజిస్ట్రేషన్‌ చేసుకొని వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఒకటి, రెండు, మూడు విడతల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చి సీటు పొందని వారు కూడా ఇప్పుడు మళ్లీ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
 

Posted Date : 15-10-2020 .