• facebook
  • whatsapp
  • telegram

మహిళా వర్సిటీ పీజీసెట్‌ - 2020 ఫలితాలు విడుదల

మహిళా వర్సిటీ(తిరుపతి), న్యూస్‌టుడే: శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో 2020-21 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం అక్టోబరు 11న నిర్వహించిన పీజీసెట్‌-2020 ఫలితాలను రెక్టార్‌ ప్రొ.సంధ్యారాణి, రిజిస్ట్రార్‌ ప్రొ.మమతలతో కలిసి వీసీ దువ్వూరు జమున అక్టోబరు 15న  విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 95 శాతం మంది అర్హత సాధించారని వీసీ తెలిపారు. కౌన్సెలింగ్‌ తేదీని వచ్చే వారం వర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తామని అడ్మిషన్స్‌ సంచాలకులు సువర్ణలతాదేవి పేర్కొన్నారు.

Posted Date : 16-10-2020 .