• facebook
  • whatsapp
  • telegram

పదో తరగతి పూర్తయ్యాక సీఏ ఫౌండేషన్‌ కోర్సుకు రిజిస్ట్రేషన్‌: ఐసీఏఐ

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌... రాష్ట్ర, జాతీయ పరీక్షలు ఏమి రాయాలన్నా ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతూనే దరఖాస్తు చేసుకొని హాజరుకావొచ్చు. సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు రాయాలంటే మాత్రం ఇంటర్మీడియట్‌ పూర్తి కావాల్సిందే. ఈ నిబంధనను మారుస్తూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పదో తరగతి పూర్తయిన తర్వాత సీఏలో మొదటి దశగా భావించే ఫౌండేషన్‌ కోర్సు పరీక్షలు రాసేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. పరీక్ష మాత్రం ఇంటర్‌ పూర్తయిన తర్వాతే రాయాలి.  ఈ నిర్ణయాన్ని మాస్టర్‌ మైండ్స్‌ విద్యాసంస్థ సంచాలకుడు మోహన్‌, అవినాష్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ బ్రహ్మదేవర అవినాష్‌ స్వాగతించారు.

Posted Date : 16-10-2020 .