నీట్‌ ఫలితాలు విడుదల

దిల్లీ: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ (యూజీ)-2020 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) అక్టోబ‌రు 16 సాయంత్రం విడుదల చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌13న జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 14.37లక్షల మందికి పైగా (90శాతం మంది) హాజరయ్యారు.
కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 3,862 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. సెప్టెంబర్‌13న కరోనా నేపథ్యంలో హాజరు కాని విద్యార్థులకు అక్టోబ‌రు 14న ప్రత్యేకంగా పరీక్ష రాసే అవకాశం కల్పించారు. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను http://ntaneet.nic.in/ వెబ్‌సైట్‌ద్వారా అధికారులు  విడుదల చేశారు.

 

Click Here for Results

Posted Date : 16-10-2020 .