• facebook
  • whatsapp
  • telegram

గ్రూపు-2 నియామకాలు ఎప్పుడు?

* సాగదీతపై అభ్యర్థుల ఆవేదన 
ఈనాడు-అమరావతి: గ్రూపు-2 ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న తీవ్ర జాప్యంపట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2018 డిసెంబరులో 446 పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి కిందటేడాది మే నెలలో ప్రిలిమ్స్‌ జరిగింది. ఇందులో అర్హత సాధించిన వారికి అదే ఏడాది ఆగస్టులో ప్రధాన పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. జులైలో కంప్యూటర్‌ ప్రావీణ్య పరీక్ష జరిగింది. కానీ ఇప్పటివరకు ఎంపికైన వారి జాబితా ప్రకటించలేదు. మందకొడిగా నియామక ప్రక్రియ జరుగుతుండటంపట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొవిడ్‌-19 కారణంగా జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగిందని ఏపీపీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబ‌రు 4వ వారం నాటికి జాబితా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపాయి.

Posted Date : 16-10-2020 .