• facebook
  • whatsapp
  • telegram

వెబ్‌సైట్‌లో ‘గురుకుల’ ప్రవేశాల హాల్‌టికెట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు అక్టోబ‌రు 17వ తేదీ నుంచి 31 వరకు గురుకుల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఆయా గురుకులాల సొసైటీ వర్గాలు తెలిపాయి. ప్రవేశ పరీక్ష నవంబరు 1న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. 

Posted Date : 16-10-2020 .