• facebook
  • whatsapp
  • telegram

జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ప్రవేశ పరీక్ష వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రు ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)లోని బ్యాచులర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ), బ్యాచులర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి అక్టోబ‌రు 18, 19 తేదీల్లో నిర్వహించాల్సిన ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఏడీఈఈ) వాయిదా పడింది. వర్షాల కారణంగా ఆ పరీక్షను నవంబరు 1, 2 తేదీల్లో జరుపుతామని విశ్వవిద్యాలయం ప్రవేశాల సమన్వయకర్త సీతా రామలక్ష్మి తెలిపారు.

Posted Date : 16-10-2020 .