• facebook
  • whatsapp
  • telegram

డిసెంబరు 13న ఎన్‌టీఎస్‌ఈ రాష్ట్ర స్థాయి పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ) రాష్ట్రస్థాయి పరీక్ష డిసెంబరు 13న జరగనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్నవారు ఈ పరీక్షకు రాయొచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబరు 12వ తేదీలోపు www.bse.telangana.gov.in  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి పరీక్షల్లో అర్హత సాధించిన వారికి జాతీయస్థాయిలో 2021 జూన్‌ 13న పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధిస్తే ఇంటర్‌ రెండేళ్లపాటు ప్రతినెల రూ.1250, డిగ్రీ నుంచి పీజీ వరకు నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుంది.

Posted Date : 16-10-2020 .