• facebook
  • whatsapp
  • telegram

నవంబరు 2 నుంచి ట్రిపుల్‌ఐటీ పీయూసీ -2 తరగతులు

నూజివీడు, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో పీయూసీ-2 విద్యార్థులకు నవంబరు 2 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు నూజివీడు ట్రిపుల్‌ఐటీ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. పీయూసీ-2 పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజినీరింగ్‌కు ప్రమోట్‌ కావలసి ఉన్నందున, వారికి పరీక్షలు నిర్వహించాలని కులపతి ఆచార్య కేసీ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పీయూసీ-2తో పాటు ఇతర తరగతుల వారికి ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Posted Date : 17-10-2020 .