డిసెంబరు 1 నుంచి ఇంజినీరింగ్‌, బీఫార్మసీ తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఫార్మసీ ప్రథమ సంవత్సరం తరగతులను దేశవ్యాప్తంగా డిసెంబరు 1వ తేదీ నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) విశ్వవిద్యాలయాలకు సూచించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన విద్యా క్యాలెండర్‌ను సవరించింది. గత ఆగస్టు 13న విడుదల చేసిన విద్యా కాలపట్టిక ప్రకారం నవంబరు 1 నుంచి తరగతులు మొదలుపెట్టాలి. ప్రథమ సంవత్సరం ప్రవేశాలను నవంబరు 15లోపు పూర్తి చేయాలి. కరోనా పరిస్థితుల కారణంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనలకు తోడు ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీలలో ప్రవేశాలు జరుగుతున్నందున విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గడువును పెంచినట్లు ఏఐసీటీఈ పేర్కొంది. తాజా మార్గదర్శకాల ప్రకారం నవంబరు 30వ తేదీ వరకు ప్రవేశాలు జరుపుకోవచ్చు.

Posted Date : 17-10-2020 .