వ్యవసాయ వర్సిటీలో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌(బీటెక్‌),  ఫుడ్‌టెక్నాలజీ(బీటెక్‌) ఫార్మర్స్‌ కోటాకు సంబంధించిన సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌లో 18 సీట్లు, ఫుడ్‌ టెక్నాలజీలో 18 సీట్లను టీఎస్‌ ఎంసెట్-2020 ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌ తెలిపారు. ఫార్మర్స్‌ (రైతు) కోటాలో సీటు పొందడానికి అభ్యర్థి కనీసం నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో విద్యాభ్యాసం చేసి ఉండాలని తెలిపారు. కనీసం ఒక ఎకరం భూమిని తల్లి, తండ్రి, అభ్యర్థిలో ఎవరైన ఒకరు కలిగి ఉంటే అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.pjtsau.edu.in వెబ్‌సైట్ను సంప్రదించాలని సూచించారు.

Posted Date : 17-10-2020 .