పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

* సీట్ల కేటాయింపు అక్టోబ‌రు 24న
ఈనాడు, అమరావతి: పాలిసెట్‌-2020 ప్రవేశాల షెడ్యూల్‌ గడువును పొడిగించినట్లు కన్వీనర్‌ ఎం.ఎం.నాయక్‌ తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులందరికీ మరోసారి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలిసెట్‌లో 60,780మంది అర్హత సాధించగా.. వీరిలో కౌన్సెలింగ్‌కు 35,346మంది నమోదు చేసుకున్నారు. సీట్ల ఎంపికకు 28,682 మంది మాత్రమే ఐచ్ఛికాలు ఇచ్చారు. దీంతో మరోసారి అవకాశం కల్పించేందుకు గడువు పొడిగించారు. ప్రాసెసింగ్‌ రుసుము చెల్లింపునకు అక్టోబ‌రు 21 వరకు.. ధ్రువపత్రాల పరిశీలన, సీట్ల ఎంపికకు ఐచ్ఛికాలు 22 వరకు గడువు ఇచ్చారు. సీట్ల కేటాయింపు అక్టోబ‌రు 24న ఉంటుంది.
 

Posted Date : 17-10-2020 .