• facebook
  • whatsapp
  • telegram

విద్యా ధ్రువపత్రాలు తడిస్తే ఆందోళన వద్దు

* విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు తడిచి దెబ్బతిన్నా, పోయినా.. .విద్యార్థులు ఆందోళన చెందవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. తగిన ఆధారాలతో ఎస్‌ఎస్‌సీ బోర్డు, ఇంటర్‌బోర్డు, విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి తదితర విభాగాల్లో  విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఒక ప్రకటనలో తెలిపారు.

Posted Date : 18-10-2020 .