• facebook
  • whatsapp
  • telegram

తొలి విడత ‘జోసా’లో 50,709 వేల మందికి సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో 50,709 మంది సీట్లు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా 110 విద్యాసంస్థల్లో ఉన్న 50,822 సీట్లకోసం 1,98,664 మంది పోటీపడగా వారికి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) అధికారులు సీట్లు కేటాయించారు. వీటిలో 127 మంది ఎన్‌ఆర్‌ఐలు కూడా సీట్లు దక్కించుకున్నారు. తొలి విడత సీట్ల కేటాయింపు తర్వాత 128 సీట్లు మిగిలిపోయాయి.  

Posted Date : 18-10-2020 .