• facebook
  • whatsapp
  • telegram

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షలన్నీ వాయిదా

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: భారీ వర్షాలు, వరదల దృష్ట్యా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో  అక్టోబ‌రు 19 నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ డి.ప్రవీణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Posted Date : 19-10-2020 .