• facebook
  • whatsapp
  • telegram

నీట్‌ ఉత్తీర్ణతలో యూపీదే అగ్రస్థానం

దిల్లీ: జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్‌)లో ఉత్తీర్ణత పరంగా దేశంలో అగ్రస్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌ నిలిచింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు 13.66 లక్షల మంది హాజరు కాగా వారిలో 7.7 లక్షల మంది ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. వీరిలో అత్యధికంగా 88,889 మంది యూపీ నుంచి ఉన్నారు. మహారాష్ట్ర రెండో స్థానంలో (79,974), రాజస్థాన్‌ మూడో స్థానంలో (65,758) నిలిచాయి. త్రిపుర నుంచి అత్యధికులు ఉత్తీర్ణులైనట్లు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నా, మానవ తప్పిదం కారణంగా అలాంటి విశ్లేషణ వచ్చినట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) గుర్తించి, సరిచేసింది.

Posted Date : 19-10-2020 .