• facebook
  • whatsapp
  • telegram

దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు

మాచవరం, న్యూస్‌టుడే: మాచవరం ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు అక్టోబ‌రు 22వ తేదీ వరకు పొడిగించినట్లు అధ్యయన కేంద్రం సహాయ సంచాలకుడు డాక్టర్‌ ఎం.అజంతకుమార్‌ తెలిపారు. ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఓపెన్‌ ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో ప్రవేశానికి అర్హులన్నారు. అదే విధంగా మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారు పీజీలో ప్రవేశానికి అర్హులన్నారు. 2020 డిగ్రీ అర్హత పరీక్ష పాసైనవారు కూడా అక్టోబ‌రు 22వ తేదీలోపు ప్రవేశం పొందవచ్చన్నారు. ఆసక్తి గల అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో అడ్మిషన్‌ పొందవచ్చన్నారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.braouonline.in ను గానీ, నేరుగా అధ్యయన కేంద్రంలోగానీ సంప్రదించాలని ఆయన తెలిపారు.

Posted Date : 19-10-2020 .