• facebook
  • whatsapp
  • telegram

ఏయూ సెట్‌ ఫలితాలు విడుదల

ఏయూ ప్రాంగణం (విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నిర్వహించిన ‘ఏయూ సెట్’ ఫలితాలు అక్టోబ‌రు 19న‌ విడుదలయ్యాయి. ఫలితాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డీవీజీడీ ప్రసాద్‌రెడ్డి విడుదల చేశారు. ఆసెట్‌కు 17,568 దరఖాస్తు చేసుకోగా.. 14,532 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే, ‘ఏయూ ఈట్‌’కు 1909 మంది దరఖాస్తు చేసుకోగా..  1259 మంది పరీక్ష రాశారు. ఆసెట్‌లో కెమికల్‌ సైన్స్‌ విభాగంలో 93 మార్కులతో కోనాల హర్షిత భవ్య టాపర్‌గా నిలిచారు. అలాగే, ఏయూ ఈట్‌లో 80 మార్కులతో కె. శ్రీకృష్ణ వెంకటసుబ్బారావు ప్రథమ ర్యాంకు సాధించారు. 

ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి
 

Posted Date : 19-10-2020 .