• facebook
  • whatsapp
  • telegram

ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలు

ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ కేలండర్‌పై కసరత్తు చేస్తోంది. అక్టోబ‌రు 25లోపు ప్రభుత్వానికి అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. తొలుత తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తారు. తరగతి బోధనతో నేర్చుకునే అంశాలను పాఠ్యాంశాలుగా తీసుకురానున్నారు. నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి. సంక్రాంతి సెలవుల తగ్గింపుతో 140 రోజులు పనిదినాలు రానున్నాయి. పదోతరగతి పరీక్షలను ఏప్రిల్‌ 15నుంచి నిర్వహించనున్నారు. పాఠ్యాంశాలను ఎంత తగ్గించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు.

Posted Date : 23-10-2020 .