• facebook
  • whatsapp
  • telegram

సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2021)ను జనవరి 10న నిర్వహించనున్నట్లు విజయనగరంలోని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపల్‌ కర్నల్‌ అరుణ్‌ కులకర్ణి ఒక ప్రకటనలో తెలిపారు. 6, 9 తరగతుల్లో ప్రవేశానికి నవంబరు 19లోగా https://aissee.nta.nic.in అనే లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Posted Date : 23-10-2020 .