• facebook
  • whatsapp
  • telegram

మరిన్ని ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్‌

దిల్లీ: అఖిల భారత స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఇకపై విద్యార్థులకు మరింత చేరువ కానుంది! వచ్చే ఏడాది నుంచి ఆ పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. 23 ఐఐటీల ఉమ్మడి ప్రవేశ బోర్డు (జేఏబీ) ఈ మేరకు అక్టోబ‌రు 22న‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నందుకుగాను జేఏబీని ఆయన అభినందించారు. ఇకపై విద్యార్థులు ప్రశ్నలను మరింత మెరుగ్గా, సమగ్రంగా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో ప్రవేశ పరీక్షలు మాతృభాషలోనే జరుగుతున్నాయని చెప్పారు. అలాంటి దేశాలే ‘ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)’ సభ్య దేశాల్లో నిర్వహించే ‘ప్రోగ్రామ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ అసెస్‌మెంట్‌ (పీఐఎస్‌ఏ)’లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయని గుర్తుచేశారు.

Posted Date : 23-10-2020 .