• facebook
  • whatsapp
  • telegram

డిప్లొమా ద్వితీయ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హబ్సిగూడ, న్యూస్‌టుడే: రామంతాపూర్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు (ఐవీసీ) రెండు సంవత్సరాలు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. కోర్సులో చేరే విద్యార్థులు అక్టోబ‌రు 26 లోపు కళాశాలకు వచ్చి నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Posted Date : 23-10-2020 .