• facebook
  • whatsapp
  • telegram

ముగిసిన టీఎస్‌ ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల గడువు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కింద బీటెక్‌ కోర్సుల్లో చేరేందుకు 54,017 మంది విద్యార్థులు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వెబ్‌ ఆప్షన్ల గడువు అక్టోబరు రాత్రి 12 గంటలకు ముగిసింది. ధ్రువపత్రాల పరిశీలనకు 55,783 మంది ముందుకు వచ్చినా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకుంది మాత్రం 54,017 మందే. ఇంకా 1,766 మంది ఆసక్తి చూపలేదు. మొత్తం 24.18 లక్షల వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఒక్కో విద్యార్థి సగటున 45 ఐచ్ఛికాలు ఇచ్చారు. ఒక విద్యార్థి అత్యధికంగా 904 ఆప్షన్లు ఇచ్చాడు. అక్టోబరు 24న సీట్లు కేటాయించనున్నారు. 

Posted Date : 23-10-2020 .