• facebook
  • whatsapp
  • telegram

ఏపీ పీజీఈసెట్‌-2020 ఫలితాలు విడుదల

విశాఖ: పీజీ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ పీజీఈసెట్‌-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఏయూ ఉపకులపతి ప్రసాద్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 87.98 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎంటెక్‌కు 14,775 మంది, ఫార్మసీలో 5,382 మంది అర్హత పొందినట్లు ప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు 28,868 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 22,911 మంది హాజరయ్యారు. 20,157 మంది అర్హులయ్యారు. మొత్తం 42 సెంటర్లలో అర్హత పరీక్ష నిర్వహించినట్లు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఎంటెక్‌తోపాటు ఎంఫార్మసీ అడ్మిషన్స్ కూడా ఆన్ లైన్‌లో నిర్వహించనున్నట్లు ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

 

ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

Posted Date : 23-10-2020 .