• facebook
  • whatsapp
  • telegram

ప్రకృతి వైద్యం, యోగా కోర్సుకు సీట్ల పెంపు

వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రకృతి వైద్యం(నేచురోపతి), యోగా కోర్సులో ప్రవేశాలకు 2020-21 నుంచి మరో 30 సీట్లను అదనంగా ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని గాంధీ ప్రకృతి వైద్యశాలలో ప్రస్తుతం ఈ కోర్సులో 30 సీట్లుండగా.. వీటిని ఈ ఏడాది నుంచి 60 సీట్లకు పెంపుదల చేస్తూ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ యోగాధ్యాన పరిషత్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ అక్టోబ‌రు 23న‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Posted Date : 23-10-2020 .