• facebook
  • whatsapp
  • telegram

నెలాఖరులోగా సచివాలయ ఉద్యోగ పరీక్ష ఫలితాలు!

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను అక్టోబరు నెలాఖరులోగా ప్రకటించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అక్టోబరు 3 నుంచి నిర్వహించిన రాతపరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 7,69,034 మంది హాజరయ్యారు. సమాధాన పత్రాల స్కానింగ్, అభ్యర్థుల వారీగా మార్కుల ప్రక్రియ దాదాపు 75 శాతం పూర్తయింది. అయితే వివిధ ప్రభుత్వశాఖల్లో ఒప్పంద, పొరుగుసేవల పద్ధతిలో పని చేస్తూ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాసిన వారికి 15 వెయిటేజీ మార్కులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో కొందరు  ప్రభుత్వశాఖలో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న విషయాన్ని నిర్ధారించలేదు. అలాంటి వారి విజ్ఞప్తులపై వివరాలు సేకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కార్యాలయం వాటిని తాజాగా సంబంధిత శాఖలకు పంపింది. వీరికి కూడా  వెయిటేజీ మార్కులు కేటాయించాల్సి ఉంది.  

Posted Date : 24-10-2020 .