• facebook
  • whatsapp
  • telegram

ఆర్‌జీయూకేటీ సెట్‌ ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

తిరుపతి(పశువైద్య వర్సిటీ), న్యూస్‌టుడే: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య వర్సిటీ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ఆర్‌జీయూకేటీ సెట్‌-2020 ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ మాధవరావు తెలిపారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరిలోని వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాలలకూ ఈ సెట్‌లో సాధించే ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది గ్రేడ్లు లేనందున ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Posted Date : 24-10-2020 .