• facebook
  • whatsapp
  • telegram

త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ 

నార్సింగి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో త్వరలో 20 వేల పోలీసు నియామకాలు జరగనున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రకటించారు. ఆర్‌బీవీఆర్‌ఆర్‌ తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అక్టోబర్‌ 24న పరేడ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 1,162 మంది కేడెట్‌ ఎస్‌ఐల గౌరవ వందనాన్ని హోంమంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 18,428 మంది ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ జరిపామని, ఇంకా 20 వేల పోలీసు ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు.  డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిజాయతీ, నిబద్ధతతో పనిచేసి పోలీసు శాఖకు తద్వారా ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ఎస్‌ఐలకు సూచించారు.

Posted Date : 24-10-2020 .