• facebook
  • whatsapp
  • telegram

24న టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాలు అక్టోబరు 24 మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడికానున్నాయి. సెప్టెంబ‌రు 28, 29 తేదీల్లో జరిగిన ఆన్‌లైన్‌ పరీక్షలకు రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 63,857 మంది విద్యార్థులు హాజరయ్యారు. జేఎన్‌టీయూహెచ్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ తదితరులు ర్యాంకుల్ని విడుదల చేస్తారు. 

Posted Date : 24-10-2020 .