• facebook
  • whatsapp
  • telegram

ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేపట్టిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అక్టోబరు 23న ప్రారంభమైంది. స్థానిక డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను హెల్ప్‌లైన్‌ సెంటర్‌గా ఎంపిక చేయగా ప్రిన్సిపల్‌ ఎన్‌.శ్రీనివాసరావు నేతృత్వంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు 140 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 70 మంది తమ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారు పత్రాల అప్‌లోడ్‌లో తమకు ఎదురైన సమస్యలను వివరించి నివృత్తి చేసుకున్నారు. ఇలా ఉండగా ఫీజు బకాయిలు చెల్లించాలని కొన్ని ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, సిబ్బంది అందుబాటులో లేరని మరికొన్ని తమ విద్యార్థులకు ఉత్తీర్ణత, బదిలీ ఇతరత్రా పత్రాలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాయన్న ఫిర్యాదులొస్తున్నాయి.  అక్టోబరు  27 వరకు కౌన్సెలింగ్‌ జరగనుండగా ఇప్పటికే ఆన్‌లైన్‌లో తమ తమ ప్రైవేటు కళాశాలలను మొదటి ప్రాధాన్యతగా నమోదు చేసేలా విద్యార్థులతో వాటి ప్రతినిధులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇళ్ల వద్ద నుంచి కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉండడంతో దగ్గరుండి మరీ వారితో ఆన్‌లైన్‌లో ఆప్షన్లు పెట్టిస్తున్నారు.

Posted Date : 24-10-2020 .