• facebook
  • whatsapp
  • telegram

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

విశాఖపట్నం: ఏపీ వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ -2020 ఫలితాలను ఆంధ్రాయూనివర్సిటీ ఉపకులపతి ప్రసాదరెడ్డి విడుదల చేశారు. విశ్వవిద్యాలయంలోని ఐఎఎస్‌ఈ ప్రాంగణంలోని ఎడ్‌సెట్‌ కార్యాలయంలో ఫలితాలు విడుదల చేసి వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,658 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 10,363 మంది పరీక్షకు హాజరయ్యారని వీరిలో 10,267 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. మొత్తం 99.07 శాతం మంది ఎడ్‌సెట్‌కు అర్హత సాధించారన్నారు. గణితంలో 99.74 శాతం మంది, భౌతిక శాస్త్రంలో 99.41 శాతం మంది, బయోలాజికల్‌ సైన్సెస్‌లో 99.03, సాంఘికశాస్త్రంలో 98.37 మంది, ఆంగ్లములో 98.83 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు. అక్టోబర్‌ 1న రాష్ట్ర వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సెట్‌ కన్వీనర్‌ ఆచార్య శివప్రసాద్‌ తదితరులు పాల్గొ్న్నారు.

Posted Date : 24-10-2020 .