• facebook
  • whatsapp
  • telegram

అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశాల గడువు పొడిగింపు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల గడువును పెంచుతున్నట్లు విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.లక్ష్మారెడ్డి తెలిపారు. గడువును న‌వంబ‌రు 26వ తేదీ వరకు పొడిగిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 7382929570/580/590/600 ఫోన్‌ నంబర్లు, విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 04023680333/555 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Posted Date : 21-11-2020 .