• facebook
  • whatsapp
  • telegram

బీడీఎస్‌ తుది ఫలితాల విడుదల

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే:  ఈ ఏడాది సెప్టెంబరు/అక్టోబరు నెలల్లో నిర్వహించిన బీడీఎస్‌ తుది పరీక్షల ఫలితాలు నవంబరు 20న విడుదలయ్యాయి. దంత వైద్య మండలి మార్గనిర్దేశకాల ప్రకారం.. గ్రేస్‌ మార్కులు కలిపిన తర్వాతే ఫలితాలను విడుదల చేశామని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పి.దుర్గా ప్రసాదరావు తెలిపారు. రీ-టోటలింగ్‌ కోరే అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.2000 చొప్పున నవంబరు 30లోగా చెల్లించాలని తెలిపారు.   ఫలితాల కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించారు.

Posted Date : 21-11-2020 .