ఎస్వీఎన్కాలనీ(గుంటూరు), న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ ప్రవేశాలను విశ్వవిద్యాలయం నవంబరు 30 వరకు పొడిగించినట్లు గుంటూరు ప్రాంతీయ అధ్యయన కేంద్ర సమన్వయకర్త పి.గోపీచంద్ ఒక ప్రకటనలో తెలిపారు. 2016 నుంచి 2020 వరకు విశ్వవిద్యాలయం నిర్వహించిన డిగ్రీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారితో పాటు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు నేరుగా ప్రవేశం పొందవచ్చన్నారు. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం ప్రవేశాలకు డిగ్రీ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులని చెప్పారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ, పీజీ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు వార్షిక ఫీజును కూడా నవంబరు 30 లోగా చెల్లించాలని వెల్లడించారు. వివరాలకు 0863-2227950, 73829 29605 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రవేశాల తుది గడువు 30
Posted Date : 27-11-2020 .