• facebook
  • whatsapp
  • telegram

నీట్, జేఈఈ సాధనకు ‘కోటా’ ఆన్‌లైన్‌ పరీక్షలు 

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఏడాది జాతీయ ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌కుమార్‌ తెలిపారు. నమూనా, ప్రాక్టీస్, గ్రాండ్‌ టెస్టులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశామని పేర్కొన్నారు. టెస్ట్‌ సిరీస్‌ రాసిన అనంతరం అఖిల భారత ర్యాంకు కూడా తెలుసుకోవచ్చని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన కావొచ్చు. మరింత సమాచారం, సందేహాల నివృత్తికి 98490 16661ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. 

Posted Date : 27-11-2020 .