• facebook
  • whatsapp
  • telegram

ట్రిపుల్‌ ఐటీ పరీక్ష వాయిదా

* ఆర్‌జీయూకేటీ కన్వీనర్‌ డి.హరినారాయణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నివర్‌ తుపాను ప్రభావం పరీక్షలపై పడింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో పరీక్ష నిర్వహణకు అనుకూల వాతావరణం లేకపోవడంతో న‌వంబ‌రు 28న‌ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన ట్రిపుల్‌ ఐటీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆర్‌జీయూకేటీ కన్వీనర్‌ డి.హరినారాయణ వెల్లడించారు. 28న‌ జరగాల్సిన పరీక్షను డిసెంబర్‌ 5వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే పరీక్షా కేంద్రాలు, ఇప్పటికే జారీ చేసిన హాల్ టికెట్ల విషయంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో రెండు గంటలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Posted Date : 27-11-2020 .