• facebook
  • whatsapp
  • telegram

2 నుంచి వైద్యకళాశాలల ఎంపికకు దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: కాళోజీ వర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో విద్యార్థులు చేరడానికి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ డిసెంబరు 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆరోగ్య వర్సిటీ సన్నాహాలు చేస్తోంది. 2020-21 వైద్య విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా అర్హులైన అభ్యర్థులు తాము కోరుకునే వైద్యకళాశాలలను ప్రాధాన్యపరంగా ఎంపిక చేసుకోవాలి. సీటు వస్తే తాము కచ్చితంగా చేరతామని నిర్ణయించుకున్న వాటినే ఐచ్ఛికాల్లో దరఖాస్తు చేయాలి.

Posted Date : 28-11-2020 .