• facebook
  • whatsapp
  • telegram

బీటెక్‌ మొదటి ఏడాదిలో మూడు సబ్జెక్టులే!

* ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు వెసులుబాటు

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు మొదటి ఏడాది ఆన్‌లైన్‌ ద్వారా బోధించాలని ట్రిపుల్‌ ఐటీ (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) నిర్ణయించింది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఆచార్యులతో చర్చించి వర్సిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తొలి ఏడాదిలో ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులు కేవలం మూడు సబ్జెక్టులు మాత్రమే ఎంచుకునే వెసులుబాటు కల్పించింది. పరీక్షల విషయంలో విద్యార్థికి ‘బి’ కంటే తక్కువ గ్రేడ్‌ వస్తే పి(పాస్‌) గ్రేడ్‌ ఎంచుకునే వీలుంటుంది. ఎఫ్‌(ఫెయిల్‌) గ్రేడ్‌ వచ్చిన వారికి మాత్రం ఇది వర్తించదు. ఆన్‌లైన్‌లో వినడం ఇబ్బందిగా ఉన్న విద్యార్థులు నేరుగా క్యాంపస్‌కు వచ్చేందుకు అనుమతిస్తారు. ఇందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. రెండో సెమిస్టర్‌లో 11 వారాల కోర్సును రెండుగా విభజించాలని నిర్ణయించారు.

Posted Date : 24-11-2020 .