• facebook
  • whatsapp
  • telegram

27 నుంచి ఈసెట్‌ రెండోదశ  కౌన్సెలింగ్‌ 

యోవేవి, న్యూస్‌టుడే : ఈసెట్‌ రెండో దశ వెబ్‌ కౌన్సెలింగ్‌ న‌వంబ‌రు 27 నుంచి ప్రారంభమవుతుందని కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌, ఈసెట్‌ కోఆర్డినేటర్‌ పీవీ.కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులు ఈసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి రుసుం ముందుగానే అంతర్జాలంలో చెల్లించాలన్నారు. ప్రాసెసింగ్‌ రుసుం జనరల్‌, బీసీ విద్యార్థులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.600 ఖరారు చేశారన్నారు. న‌వంబ‌రు 27 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న కౌన్సెలింగులో వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవచ్చన్నారు. ఇతరవివరాలకు apecet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

Posted Date : 24-11-2020 .