కృష్ణావిశ్వవిద్యాలయం(మచిలీపట్నం), న్యూస్టుడే: కృష్ణావిశ్వవిద్యాలయ పరిధిలో (2019-20) విద్యా సంవత్సర బీఫార్మసీ ఎనిమిదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి కె.బి చంద్రశేఖర్ ఆదేశాలతో పరీక్షల నియంత్రణాధికారి డా.రామశేఖరరెడ్డి, పీజీ సమన్వయకర్త డా.కె.జ్యోతిర్మయిలు నవంబరు 23న విడుదల చేశారు. ఈ ఫలితాలతోపాటు వాటికి సంబంధించిన పునఃమూల్యాంకన తేదీల వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పొందుపరిచినట్లు రామశేఖరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. లా, బీఈడీ, డీపీఈడీ, బీపీఈడీ, బీటెక్, స్పెషల్ బీఈడీ, ఫార్మసీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలను నవంబరు 30 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బీఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల
Posted Date : 24-11-2020 .