• facebook
  • whatsapp
  • telegram

27 వరకు పీజీ కౌన్సెలింగ్‌ పొడిగింపు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ను న‌వంబ‌రు 27వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సంచాలకులు డాక్టర్‌ హరిబాబు న‌వంబ‌రు 23న‌ తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు డిగ్రీ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు, మార్కుల లిస్టు, టీసీలు ఆలస్యంగా జారీ చేస్తుండడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు, 27 వరకు వెబ్‌ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయన్నారు. డిగ్రీ ఇన్‌స్టెంట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారూ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ఆయన వివరించారు.

Posted Date : 24-11-2020 .