• facebook
  • whatsapp
  • telegram

ఉత్తమ ర్యాంకర్ల ఎంపిక ఐఐటీ తిరుపతి

* నిట్తాడేపల్లిగూడెంలోనూ చేరిక

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన జాతీయ విద్యాసంస్థల్లో ఉత్తమ ర్యాంకర్ల ప్రవేశాలు పెరుగుతున్నాయి. గతంతో పోల్చితే ఐఐటీ తిరుపతి, నిట్తాడేపల్లిగూడెంలో ప్రవేశాలకు మెరుగైన ర్యాంకర్లు పోటీ పడ్డారు. ఐఐటీ తిరుపతిలో మూడేళ్ల కిందట జనరల్కేటగిరిలో కంప్యూటర్సైన్సుకు ప్రారంభ ర్యాంకు 2,834 ఉండగా, ఈసారి 1,817తోనే ప్రారంభమైంది. ముగింపు ర్యాంకు 3,850 ఉండగా ఈసారి 4,117గా ఉంది. ఈడబ్ల్యూఎస్కోటా రిజర్వేషన్అమలుకు 25 శాతం సీట్లను పెంచడంతో ముగింపు ర్యాంకు కొంత పెరిగింది. ఈ విద్యాసంస్థలోనే ఈ ఏడాది సివిల్ప్రారంభ ర్యాంకు 6,156 కాగా ముగింపు 13,585గా ఉంది. మెకానికల్ప్రారంభ, ముగింపు ర్యాంకులు 7,686-8,971గా ఉన్నాయి. మొత్తం విద్యార్థుల్లో ఏపీ, తెలంగాణకు చెందినవారు 55 శాతం మంది ఉండగా, మిగిలిన 45 శాతం కోటాలో 19రాష్ట్రాలవారు ప్రవేశాలు పొందారు. 
* నిట్తాడేపల్లిగూడెంలో ఏపీ విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్ఉండగా.. మిగతా సీట్లను ఇతర రాష్ట్రాలవారీతో భర్తీ చేస్తారు. సొంత రాష్ట్రం కోటాలో మూడేళ్ల కిందట కంప్యూటర్సైన్సులో ప్రారంభ ర్యాంకు 11,179 ఉండగా ఈసారి 5,652తో మొదలైంది. సివిల్లో ఈ ఏడాది ప్రారంభ, ముగింపు ర్యాంకులు 32,298- 43,088గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల కోటాలో కంప్యూటర్సైన్సు విభాగంలో గతేడాది ప్రారంభ ర్యాంకు 8,774 ఉండగా..ఈసారి 5,222గా ఉంది. కొత్తగా ఏర్పాటైన జాతీయ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడడం, ప్రాంగణ నియామకాలు పెరగడంతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. 
 

ఐఐటీ తిరుపతిలో కంప్యూటర్సైన్సు
సంవత్సరం - ప్రారంభ ర్యాంకు - ముగింపు

2020      -     1,817             -         4,117
2019    -       2,749           -           3,551
2018      -     2,834           -           3,850

నిట్తాడేపల్లిగూడెంలో ఏపీ కోటా కంప్యూటర్సైన్సు 
సంవత్సరం - ప్రారంభ ర్యాంకు - ముగింపు

2020    -       5,652         -             14,075
2019     -      7,023         -             14,099
2018      -     11,179            -          18,398    
 

ఆదరణ పెరుగుతోంది: సత్యనారాయణ, సంచాలకులు, ఐఐటీ తిరుపతి
తిరుపతి ఐఐటీ అభివృద్ధి చెందుతోంది. ఇందులో చేరేందుకు ఉత్తమ ర్యాంకర్లు పోటీ పడుతున్నారు. దాదాపు 19రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. మౌలిక వసతులు సమకూరుతున్నాయి.  
 

Posted Date : 25-11-2020 .