• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ ఫీజులు ఖరారు..!

ఈనాడు, అమరావతి: డిగ్రీ కళాశాలల బోధన రుసుములను ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఖరారు చేసినట్లు తెలిసింది. నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మొత్తం మూడు కేటగిరీల్లో ఫీజులను నిర్ణయించింది. త్వరలో దీనిపై ఉత్తర్వులు రానున్నాయి. మొదటి కేటగిరీలో బీఏకు రూ.10 వేలు, బీఎస్సీ కంప్యూటర్స్‌కు రూ.15,500, బీబీఎంకు రూ.18 వేలు, బీసీఏకు రూ.19 వేలు ఫీజుగా నిర్ణయించినట్లు తెలిసింది. అత్యధికంగా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు రూ.30 వేల ఫీజును ఖరారు చేశారు. బీకాం జనరల్‌కు రూ.12,500 నిర్ణయించారు.

Posted Date : 28-11-2020 .