• facebook
  • whatsapp
  • telegram

అగ్రిసెట్‌లో నంద్యాల విద్యార్థినికి ప్రథమ ర్యాంకు

నంద్యాల, న్యూస్‌టుడే:  కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమో పూర్తి చేసిన షేక్‌ సల్మాకు ఇటీవల నిర్వహించిన ‘అగ్రిసెట్‌’ లో ప్రథమ ర్యాంకు లభించింది. గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి విష్ణువర్ధన్‌రెడ్డి అగ్రిసెట్‌ పరీక్షాల ఫలితాలను  నవంబరు 26న విడుదల చేశారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఏజీ బీఎస్సీ డిగ్రీలో చేరేందుకు అగ్రిసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 2,433 మంది ఉత్తీర్ణత సాధించగా నంద్యాలకు చెందిన షేక్‌ సల్మా 109 మార్కులతో మొదటి ర్యాంకు పొందింది. ఈ సందర్భంగా సల్మాను అగ్రిసెట్‌ రాష్ట్ర కన్వీనరు డా.టి.మురళీకృష్ణ అభినందించారు.  వ్యవసాయ పట్టభద్రురాలిని కావాలన్న లక్ష్యంతోనే చదివానని షేక్‌ సల్మా తెలిపారు. నంద్యాల జీఎం వ్యవసాయ పాలిటెక్నిక్‌లో చదివిన యు.శోభ  4వ ర్యాంకు సాధించారు.

Posted Date : 28-11-2020 .