ఈనాడు, అమరావతి: కడపలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి 224 పోస్టులను మంజూరు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సులకు కలిపి 138 బోధన పోస్టులు, 86 బోధనేతర పోస్టులను మంజూరు చేసింది. బోధనేతర పోస్టుల్లో ఈ ఏడాది 45, వచ్చే విద్యా సంవత్సరంలో మరో 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. యూజీలో 75 సహాయ ఆచార్యులు, 34 అసోసియేట్ ఆచార్యులు, 13 ఆచార్యుల పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీకి 16 పోస్టులు కేటాయించారు.
ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయానికి 224 పోస్టులు మంజూరు
Posted Date : 28-11-2020 .