• facebook
  • whatsapp
  • telegram

18 డైట్‌ కళాశాలలకు ప్రవేశాల నిరాకరణ

పెడనగ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ఈ ఏడాది 18 ప్రయివేటు డీఈడీ (డిప్లామో ఇన్‌ ఎడ్యుకేషన్‌) కళాశాలలు మూత పడ్డాయి. డీఈఈసెట్‌ రాస్తున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 500 మంది విద్యార్థులు మాత్రమే డీఈఈ సెట్‌ రాశారు. దీంతో పలు కళాశాలలకు ప్రవేశాల ప్రక్రియను ఈ ఏడాది నుంచే నిలుపుదల చేయాలని ప్రిన్సిపాళ్లకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 ప్రయివేటు, ఒక ప్రభుత్వ(అంగలూరు) డీఎడ్‌ కళాశాలు ఉన్నాయి. ఇకపై 12 ప్రయివేటు కళాశాలలు మాత్రమే పని చేయనున్నాయి. వీటిల్లో ప్రవేశం కోసం నవంబరు 24 నుంచి 29వ తేదీ వరకు వెబ్‌ ఐచ్చికాలు నమోదుకు అవకాశం కల్పించారు. నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. డిసెంబరు 2వ తేదీ నుంచి హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి అవకాశం కల్పించారు. ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అంగలూరు డైట్‌ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డా.వెంకటేశ్వరరావు తెలిపారు.

Posted Date : 28-11-2020 .