• facebook
  • whatsapp
  • telegram

ఐఐసీటీతో మైసూర్‌ వర్సిటీ ఒప్పందం

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: శాస్త్రీయ పరిశోధనల్లో మైసూర్‌ విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) కలిసి పనిచేయనున్నాయి. ఆ మేరకు రెండు సంస్థలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఈ పత్రాలను ఐఐసీటీ డైరెక్టర్‌ డా.ఎస్‌.చంద్రశేఖర్, మైసూర్‌ విశ్వ విద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ జి.హేమంత్‌కుమార్‌ మంగళవారం మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని ప్రత్యేక అంశాలపై రెండు సంస్థలు సంయుక్తంగా పరిశోధన సాగిస్తాయి. ఐఐసీటీ శాస్త్రవేత్తలు మైసూర్‌ విశ్వ విద్యాలయం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు దిశానిర్దేశం చేస్తారు.

Posted Date : 13-01-2021 .