Asked By: జి.అరుణ
Ans:
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) అనేది దేహ్రాదూన్‌లో 1982 వ సంవత్సరంలో స్థాపితమైన స్వయం ప్రతిపత్తి గల విద్యా శిక్షణ సంస్థ. దీనికి భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణతో పాటుగా బయోడైవర్సిటీ రంగంలో కూడా పరిశోధనలు జరుగుతాయి. ఈ సంస్థ వైల్డ్ లైఫ్ సైన్సెస్‌లో ఎంఎస్సీనీ, హెరిటేజ్ కన్సర్వేషన్ అండ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్నూ అందిస్తుంది. వీటితో పాటు పీ‡హెచ్డీ కోర్సు కూడా అందుబాటులో ఉంది. వైల్డ్‌లైఫ్ సైన్సెస్‌లో ఎంఎస్సీ కోర్సు చదవాలంటే సైన్స్, మెడికల్, ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్‌ల్లో ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ చేసివుండాలి. ఇంజినీరింగ్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ ల్లో డిగ్రీ చేసినవారు హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో బయాలజీ చదివి ఉండాలి. ప్రవేశపరీక్ష రాయడానికి డిగ్రీలో కనీసం 50 శాతంతో ఉత్తీర్ణత పొందివుండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది. ఈ కోర్సు చదవాలంటే 25 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ విభాగాల్లో పనిచేస్తున్నవారికి 10 సంవత్సరాల సడలింపు ఉంది.
ఈ అర్హతలున్న అభ్యర్థులు జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షను ఆన్లైన్ లో రాయాలి. ఈ పరీక్ష 100 మార్కులకు 2 గంటల వ్యవధిలో జరుగుతుంది. పరీక్షలో మూడు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో కరెంట్ అఫైర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్; రెండో విభాగంలో వైల్డ్ లైఫ్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, కన్జర్వేషన్; మూడో విభాగంలో వైల్డ్‌లైఫ్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, కన్జర్వేషన్ల్లో ఒక ఎస్సే ఉంటుంది. మొదటి రెండు విభాగాల్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రవేశపరీక్ష లో పొందిన మార్కుల ఆధారంగా ఇంటర్వూలు నిర్వహిస్తారు. రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూ కి 30 శాతం వెయిటేజి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో పొందిన మార్కుల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. సాధారణంగా ప్రవేశ ప్రకటన జనవరి/ ఫిబ్రవరి నెలలో వస్తుంది. అర్హత పరీక్ష, ఇంటర్వూలు మే నెలలో నిర్వహిస్తారు. జూన్ నెలలో అడ్మిషన్లు పూర్తిచేసి జులైౖలో తరగతులు ప్రారంభిస్తారు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సుశ్రిత తోడ్కర్, కడప
Ans:
మాస్టర్స్ ఆఫ్ సైన్స్ (ఎం.ఎస్.సి.) బయోకెమిస్ట్రీ రెండు సంవత్సరాల పీజీ కోర్సు. ఇతర సైన్స్ సబ్జెక్టులతో పూర్తి చేస్తే ప్రభుత్వ వైద్యశాలల్లో క్లినికల్ బయోకెమిస్ట్‌గా, ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలో టెక్నీషియన్‌గా కెరియర్ను మొదలుపెట్టవచ్చు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన దిళీఖిళి, దీళీగి, దీతీగి, ఖిదిలీళి, మెడికల్ రిసెర్చ్ ల్యాబ్‌లు, ఫార్మా పరిశోధన సంస్థలతో పాటు, ప్రైవేటు ఫార్మా, బయోటెక్ సంస్థల్లో టెక్నీషియన్‌గా, శాస్త్రవేత్తగా ఉపాధి పొందవచ్చు. దిళీఖిళి నిర్వహించే నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా కూడా స్థిరపడవచ్చు. పీహెచ్డీ చేసి పరిశోధన, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్ పోలిస్తే దీన్ని చదివేవారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగ మార్కెట్లో వీరి కొరత ఎక్కువగా ఉంది. బయోకెమిస్ట్రీలో జీవుల శరీరంలో జరిగే రసాయన ప్రక్రియల గురించి సైద్ధాంతిక, ఆచరణాత్మక స్థాయిలో బోధిస్తారు. డిగ్రీ స్థాయిలో బీఎస్సీ బయో కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ చదివినవారు ఈ కోర్సుకు అర్హులు. ఎం.ఎస్.సి. బయోకెమిస్ట్రీ
Asked By: వి. రమేష్
Ans:
సాధారణంగా ఎంఏ (తెలుగు) చదివినవారు అధ్యాపకులుగా, టీపీటీ చేసి ఉపాధ్యాయులుగా స్థిరపడతారు. ఈ రెండూ కాకుండా ఇతర అవకాశాలంటే.. ముందుగా మీడియా, జర్నలిజం రంగాల గురించి చెప్పవలసి ఉంటుంది. ఇటీవలికాలంలో ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం పెరిగింది. సమకాలీన అంశాలపై ఆసక్తి, ఉచ్చారణపై పట్టు సాధించి, సృజనాత్మకతను పెంపొందించుకుంటే మీడియా, పత్రికా రంగంలో విలేఖరులుగా, కంటెంట్ రచయితలుగా, న్యూస్ ప్రెజెంటర్లుగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. వీటితో పాటు వెబ్ చానల్స్, సినిమా, నాటక రంగాల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు. భాషాశాస్త్రంలో ప్రావీణ్యం సాధించి కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ రంగంలో ప్రవేశించవచ్చు. ఆంగ్ల, హిందీ భాషలపై మంచి పట్టు సాధించి అనువాద రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. వీటితో పాటుగా, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ ప్రయత్నించవచ్చు.
Asked By: ఆర్. నిఖిత
Ans:
బీఎస్సీ కంప్యూటర్స్ తరువాత మీరు ఏదైనా సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు చేసే అవకాశం ఉంది. ఏ కోర్సు చేయాలనేది మీ భవిష్యత్ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు కంప్యూటర్ రంగంలోకి వెళ్ళాలనుకొంటే కోడింగ్, డాట్ నెట్, జావా, హెచ్‌టీఎంఎల్, టెస్టింగ్ సంబంధిత కోర్సులు చేయవచ్చు. మల్టీమీడియా రంగంలో ఆసక్తి ఉంటే యానిమేషన్, గేమింగ్ లాంటివి చేయవచ్చు. డేటా అనలిటిక్స్ రంగంలోకి వెళ్లాలంటే మెషిన్ లర్నింగ్, పైతాన్, ఆర్ ప్రోగ్రామింగ్, డేటా విజువలైజేషన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి కోర్సుల గురించీ ఆలోచించవచ్చు. ఇవే కాకుండా డిజిటల్ మార్కెటింగ్, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ క్వాలిటీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మొబైల్ కంప్యూటింగ్ లాంటి కోర్సులు కూడా చేయవచ్చు. ఉద్యోగావకాశాల పరంగా పీజీ కోర్సు చెయ్యడం మంచిది. భవిష్యత్తులో మీరు వ్యాపార రంగంలోకి వెళ్ళాలనుకుంటే ఎంబీఏ కోర్సునూ; ఐ.టి./ కంప్యూటర్స్ రంగంలో స్థిరపడాలనుకుంటే ఎం.సి.ఎ.నూ చెయ్యడం మంచిది. - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎన్. శివప్రియ
Ans:
నేరాలు, క్రిమినల్ కేసుల దర్యాప్తులో ఫోరెన్సిక్ సైన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కోర్సులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ, సోషియాలజీ సబ్జెక్టుల అంశాలను నేర్పిస్తారు. ఈ కోర్సు ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఫోరెన్సిక్ సైన్స్‌లో ఆసక్తి ఉన్నవారికి బ్యాచిలర్స్, మాస్టర్స్ స్థాయిలో కోర్సులు ఉన్నాయి, బ్యాచిలర్స్ స్థాయిలో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ (ఆనర్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు చదవడానికి 10+2 లేదా ఇంటర్మీడియట్‌ను సైన్స్ గ్రూపుతో ఉత్తీర్ణులవ్వడం కనీస అర్హత. మాస్టర్స్ స్థాయిలో ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎం.ఎస్.సి. ఫోరెన్సిక్ సైన్స్, ఎం.ఎస్.సి.ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ¨, ఎం.ఎస్.సి.ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్ లాంటి కోర్సులు ఉన్నాయి. బ్యాచిలర్స్ స్థాయిలో బయాలజీకి సంబంధించిన బ్రాంచితో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అవ్వడం ఈ కోర్సుకు కనీస అర్హత. చాలా కళాశాలలు ప్రవేశ పరీక్ష లేకుండా మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు ఆయా విశ్వవిద్యాలయాల ద్వారా జారీ అవుతాయి. బ్యాచిలర్స్ స్థాయిలో ఈ కోర్సు చేసిన తరువాత ఉద్యోగావకాశాలు లభించడం కష్టంగా ఉంటే, మాస్టర్స్ చెయ్యడం వల్ల కెరియర్ను మొదలుపెట్టడం శ్రేయస్కరం. ఫోరెన్సిక్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసినవారికి, ఫోరెన్సిక్ సైంటిస్ట్, ప్రైవేటు ఇన్వెస్టిగేటర్స్, డ్రగ్ అనలిస్ట్, క్రైం ల్యాబ్ అనలిస్ట్, ఫోరెన్సిక్ ఆర్కిటెక్ట్, ఫోరెన్సిక్ ఇంజినీర్, పోలీస్ శాఖ, ఫోరెన్సిక్ కన్సల్టెంట్ లాంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: శ్రీహర్షిత
Ans:
ఒకే సమయంలో ఒక రెగ్యులర్ కోర్సు, ఒక దూరవిద్య/ఆన్లైన్ కోర్సు చదువుకోవడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 2020లో ఆమోదం తెలిపింది. దీని ప్రకారం మీరు రెగ్యులర్ మోడ్‌లో ఏ కోర్సు చదువుతున్నా కానీ, దూరవిద్య/ఆన్లైన్ ద్వారా నచ్చిన కోర్సులో చేరే అవకాశం ఉంది. మీరు బీబీఏ డిగ్రీ రెగ్యులర్‌గా చదువుతూ, ఇగ్నో ద్వారా బీఏ డిగ్రీని కూడా పూర్తిచేసుకోవచ్చు. అయితే ఒకే సమయంలో రెండు డిగ్రీలను రెగ్యులర్ మోడ్‌లో చదవడం కుదరదు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: - నాగేంద్ర, విజయనగరం
Ans:
మెడికల్ డ్రగ్స్, పాలిమర్, ఎలక్ట్రానిక్ పరికరాల రంగాల్లో ఈ కోర్సు విజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. దీన్ని పూర్తి చేసినవారికి సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్, అనలిటికల్ కెమిస్ట్రీ అసోసియేట్, రిసెర్చ్ కెమిస్ట్, టాక్సాలజిస్ట్ ఉద్యోగాలు లభిస్తాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జి.ఎస్.ఐ, ఫెడరల్ హెల్త్ డిపార్ట్మెంట్, ఫుడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఐఐసీటీ లాంటి ప్రభుత్వరంగ సంస్థల్లో, ఆర్ అండ్ డీ శాఖల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి. ప్రైవేటు రంగంలో జి.ఎస్.కె., డాక్టర్ రెడ్డి లాబ్స్, అరబిందో ఫార్మా, హెటిరో, సన్, బేయర్స్ లాంటి కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. పీ‡హెచ్డీ చేసి పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తగా, విద్యాసంస్థల్లో అధ్యాపకుడిగా స్థిరపడవచ్చు. పీహెచ్డీ తరువాత విదేశాల్లో పోస్ట్ డాక్టొరల్ ఫెలోషిప్‌కీ అవకాశాలున్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: - అస్లామ్ షేక్
Ans:
ఐటీఐకి పదో తరగతి ఉత్తీర్ణత కనీస అర్హత. మీరు బీటెక్ తరువాత ఐటీఐ చేయవచ్చు. కానీ, అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పదో తరగతి తరువాత ఆరు సంవత్సరాలు చదివి, ఇప్పుడు ఐటీఐ చదవడం అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. కెరియర్ నిర్ణయాలు చాలా జాగ్రత్తతో తీసుకోవాలి. ఇంజినీరింగ్ చదివిన తరువాత ఐటీఐ లాంటి కోర్సు చదవడం వల్ల చెప్పుకోదగ్గ ప్రయోజనం ఉండదు. మీకు మెకానికల్ ఇంజినీరింగ్ రంగంలో విషయ పరిజ్ఞానం సరిపడేంత లేకపోతే, దాన్ని పెంచుకొనే ప్రయత్నం చేసి మెరుగైన ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: బి.అనిల్
Ans:
స్టాటిస్టిక్స్ సబ్జెక్టు మీద పట్టున్నవారికి విస్తృతంగా అవకాశాలు ఉంటాయి. పీజీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ లేదా ఎంస్టాట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డేటాను విశ్లేషించి, వ్యాపార వ్యవహారాల గురించి నిర్ణయాలు తీసుకోవడం స్టాటిస్టిక్స్‌తో సాధ్యం అవుతుంది. డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్ చదివినవారు ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సులకు దేశంలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)అగ్రగామి సంస్థ. ఐఎస్ఐలో ఎంస్టాట్ కోర్సు చదివినవారికి ప్రతినెల రూ.8000 స్టైపెండ్ చెల్లిస్తారు. ఇక్కడ చదివినవారు ఆకర్షణీయ వేతనాలతో బహుళజాతి సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశం కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా, ఆంధ్రా యూనివర్సిటీ...మొదలైన సంస్థల్లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సు అందుబాటులో ఉంది. పీజీలో స్టాటిస్టిక్స్ చదివినవారికి ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, యాక్చూరియల్, డేటా మెట్రిక్స్, మార్కెటింగ్ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్) స్కోర్‌తో పీహెచ్‌డీలో చేరవచ్చు. ఇలా అవకాశం పొందినవారు నెలనెలా స్టైపెండ్ అందుకోవచ్చు. మరో పీజీ చదవాలనే ఆసక్తి ఉంటే బిజినెస్ ఎనలిటిక్స్‌లో ఎంబీఏ కూడా చేయవచ్చు. యాక్చూరియల్ సైన్స్‌లో సర్టిఫికెట్, డిప్లొమాకోర్సులు కూడా చదువుకోవచ్చు. పీహెచ్డీ పూర్తిచేసుకున్నవారు బోధన, పరిశోధనల్లో రాణించవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: కె. గోపాల్
Ans:
ఎంఏ పొలిటికల్ సైన్స్ రెండు సంవత్సరాల పీజీ కోర్సు. దీనిలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల గురించిన సిద్ధాంతాలనూ, విషయాలనూ బోధిస్తారు. సాధారణంగా ఈ కోర్సు చదవాలంటే, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్‌తో డిగ్రీ సాధించి ఉండాలి. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏ డిగ్రీ చదివినవారికైనా పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. బీఎస్సీ (ఎంపీసీ) చేసిన మీరు పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేయడానికి అర్హులే. అయితే, ఈ కోర్సు మీ ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని విశ్లేషించుకుని పై నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఈ కోర్సు పూర్తి చేసినవారికి విద్యావేత్త, పొలిటికల్ కన్సల్టెంట్, రాజకీయాలకు సంబంధించిన కంటెంట్ రైటింగ్ లాంటి ఉద్యోగాలతోపాటు పొలిటికల్ సర్వే సంస్థల్లో, స్వచ్ఛంద సంస్థల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డిగ్రీ కాలేజీ లెక్చరర్ అవ్వాలనుకొంటే ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో కనీసం 55 శాతం మార్కులు సాధించి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత లేదా పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్డీ కానీ చేసి ఉండాలి. మీరు జూనియర్ లెక్చరర్ కావాలనుకొంటే పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత అవసరం. ఉభయ తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా మీరు జేఎల్, డీఎల్ ఉద్యోగాలను పొందవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్