• facebook
  • whatsapp
  • telegram

ఆతిథ్యానికి ఆహ్వానం

చారిత్రక ప్రసిద్ధ ప్రదేశాలనూ, ప్రకృతి సౌందర్యం అలరారే ప్రాంతాలనూ సందర్శించటానికి విదేశీ స్వదేశీ యాత్రికులూ, పర్యాటకులూ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆతిథ్యరంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉపాధి అవకాశాలు బాగా మెరుగవుతున్నాయి. దీంతో ఆతిథ్య నిర్వహణ (హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌) మెరుగైనదిగా, ఉత్తమమైనదిగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

 

 

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసిన విద్యార్థులు స్టార్‌ హోటళ్ళలో మాత్రమే కాకుండా ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఏర్‌లైన్స్‌, బహుళజాతి సంస్థల్లో ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, క్రూయిజ్‌ లైన్స్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర రంగాల్లో కూడా ఉద్యోగాలను పొందగలుగుతారు.

 

సేవారంగానికి సంబంధించినది కాబట్టి దీనిలో వినియోగదారుల అవసరాలపై అవగాహన అత్యవసరం. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు సర్టిఫికెట్‌ కోర్సులు కూడా లభ్యమవుతున్నాయి. క్రమశిక్షణ, సహనం, సత్ప్రవర్తన, కష్టపడే స్వభావం ఉన్నవారుఆతిథ్యరంగంలో బాగా రాణిస్తారు.

 

ఈ రంగంలో ప్రామాణిక విద్యను అందించటం కోసం భారత ప్రభుత్వ పర్యాటక శాఖ National Council for HM&CT అనే సంస్థను 1987లో స్థాపించింది. దానికి అనుబంధంగా 21 కేంద్ర IHMలు, 40కి పైగా రాష్ట్ర IHMలతో వేల మంది విద్యార్థులకు విద్య, శిక్షణావకాశం కల్పిస్తోంది. తద్వారా హోటల్‌, పర్యాటక రంగాలకు మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, కార్పొరేట్‌ ట్రెయినీలుగా ఉపాధికి వీలు కల్పిస్తోంది.

 

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసిన విద్యార్థులు స్టార్‌ హోటళ్ళలో చెఫ్‌లు, ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ఫూడ్‌ అండ్‌ బేవరేజ్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉద్యోగ ప్రవేశం చేయవచ్చు. అంతే కాదు; ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఏర్‌లైన్స్‌, బహుళజాతి సంస్థల్లో ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, క్రూయిజ్‌ లైన్స్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర రంగాల్లో కూడా ఉపాధికి అర్హులవుతారు.

 

దేశంలో స్థాపిస్తున్న అంతర్జాతీయ, జాతీయ హోటళ్ళకు మానవ వనరుల ఆవశ్యకత పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తగిన నూతన సిలబస్‌తో ప్రామాణిక విద్యను అందించటానికి ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ 40 ఏళ్లుగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి.

 

ఉద్యోగావకాశాలు: ఈ కోర్సు మూడో సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత ప్రాంగణ నియామకం (క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌) ద్వారా మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, కార్పొరేట్‌ ట్రెయినీలుగా వివిధ సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. ఎంపికైనవారికి కనీస జీతం రూ.14,000; గరిష్ఠంగా రూ.35,000 నుంచి 40,000 వరకు ఉంటుంది.

 

ఎక్కువమందిని నియమించుకున్న కొన్ని సంస్థలు (బ్రాకెట్లలో ఆఫర్లు అందుకున్న విద్యార్థుల సంఖ్య):

1. Royal Orchids (26)

2. OCLD/OCER (22)

3. Mc. Donald (20)

4. Aravind brands (31)

5. Best seller (Jack &jones) (21)

 

సబ్జెక్టుల వివరాలు

మొత్తం కోర్సు: 6 సెమిస్టర్లు

Compulsory core subjects

a) food production

b) F&B service

c) Accomodation operation

d) Front office

ఇవేకాక ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజీ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, ఫూడ్‌ సైన్స్‌, న్యూట్రిషన్‌, కంప్యూటర్‌ మొదలైనవి ఉంటాయి.

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీకి జాతీయస్థాయి పోటీ పరీక్ష ద్వారా ప్రవేశాల ఎంపిక జరుగుతుంది.

 

రాతపరీక్షా విధానం

1. Numerical ability and Scientific Aptitude- 30 Q

2. Reasoning and Logical Deduction- 30 Q

3. General Knowledge and Current Affairs- 30Q

4. English Language- 60Q

5. Aptitude for Service Sector- 50Q

Website: http://nchm.nic.in/

 

కోర్సులు

మరిన్ని